TSPSC Extension Officer Recruitment 2022: తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్/సూపర్‌వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదలైంది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. కాళేశ్వరం-26, బాసర- 27, రాజన్న- 29, భద్రాద్రి- 26, యాదాద్రి- 21, చార్మినార్- 21, జోగులాంబ- 31 పోస్టులు జోన్ల వారీగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు హోమ్ సైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్/బోటనీ/జువాలజీ అండ్ కెమిస్ట్రీ/అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్/బోటనీ/క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్/బయో కెమిస్ట్రీ/ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్/జువాలజీ/బోటనీ అండ్ కెమిస్ట్రీ/బయోలాజికల్ కెమిస్ట్రీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జులై 1, 2022వ తేదీనాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 29, 2022వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.280లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.35,720ల నుంచి రూ.1,04,430ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
ఆన్‌లైన్‌లో జరిగే ఈ రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 150 ప్రశ్నలు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగం నుంచి వస్తాయి. పేపర్-2లో సంబంధిత డిగ్రీ సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలకు ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 300 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 300 మార్కులు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.