TSPSC AE Final Answer Key 2024: తెలంగాణ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 837 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది అక్టోబర్‌లో రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 18, 20, 26 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీని టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. గతేడాది నవంబర్ 1వ తేదీన ప్రాథమిక ఆన్సర్‌ కీని కమిషన్‌ విడుదల చేసింది. దీనిపై వచ్చిన అభ్యంతరాలు నిపుణుల కమిటీ..

TSPSC AE Final Answer Key 2024: తెలంగాణ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
TSPSC AE Final Answer Key

Updated on: Apr 05, 2024 | 3:16 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 837 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది అక్టోబర్‌లో రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 18, 20, 26 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీని టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. గతేడాది నవంబర్ 1వ తేదీన ప్రాథమిక ఆన్సర్‌ కీని కమిషన్‌ విడుదల చేసింది. దీనిపై వచ్చిన అభ్యంతరాలు నిపుణుల కమిటీ పరిశీలించి తుది ఆన్సర్‌ కీని సిద్ధం చేసింది. దీనిని ఆమోదించిన టీఎస్పీఎస్సీ తాజాగా జవాబు పత్రాలతోపాటు ఫైనల్ ఆన్సర్‌ కీని వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన వివరించారు. తుది కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఫలితాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 15 నుంచి తెలంగాణ పాఠశాలల వార్షిక పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు వార్షిక పరీక్షల టైమ్‌ టేబుల్‌ను విద్యాశాఖ మూడోసారి మార్చినట్లు ప్రకటించింది. ఇప్పటికే రెండు సార్లు మర్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మరోసారి టైంటేబుల్‌ను మార్చి , కొత్త టైం టేబుల్‌ను ఏప్రిల్‌ 4 (గురువారం) విడుదల చేసింది. తాజా టైం టేబుల్ ప్రకారం ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాలల యాజమన్యాలు, విద్యార్ధులు గ్రహించాలని పేర్కొంది.

ఆయా తేదీల్లో ఒకటి నుంచి ఏడో తరగతి పరీక్షలు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి 11.45 గంటల వరకు , తొమ్మిదో తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగతాయని పేర్కొంది. 23వ తేదీన విద్యార్ధుల మార్కులు వెల్లడించి, 24వ తేదీన విద్యార్దుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తారు. 25వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.

ఇవి కూడా చదవండి

తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us