TS Constable Exam: తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక పరీక్ష జరగనుంది. సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. అయితే సివిల్ ఇతర విభాగాల్లో 15644, ట్రాన్స్‌పోర్టు-63, ఎక్సైజ్‌లో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామక బోర్డు గత ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అయితే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్ష కేంద్రాలు
ఈ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమయ్యే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఇవి క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఉంటాయి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మొత్తం 200 మార్కులు ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీస్‌లో 20 మార్కులు ఉంటాయి.
వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్..
ఈ కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకున్న సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటో కాకుండా వేరే ఫోటో అతికించినా లేదా హాల్‌టికెట్ సరిగ్గా లేకున్నా పరీక్షకు అనుమతి ఉండదని గుర్తించుకోవాలి.
పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు..
కానిస్టేబుల రాత పరీక్ష కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి అనుతించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని కెరీర్ & ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి