TSLPRB: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. వారికి మరోసారి ఛాన్స్.. కానీ..

|

Feb 17, 2023 | 4:17 PM

TSLPRB: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక సంస్థ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ జాబ్స్ కోసం అప్లై చేసుకుని, ప్రిలిమ్స్ పాసైన గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్ ఇచ్చింది.

TSLPRB: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. వారికి మరోసారి ఛాన్స్.. కానీ..
Tslprb Updates
Follow us on

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక సంస్థ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ జాబ్స్ కోసం అప్లై చేసుకుని, ప్రిలిమ్స్ పాసైన గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ టెస్ట్‌కు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు టీఎస్ఎల్‌పిఆర్‌బి మరో అవకాశం కల్పించింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు దేహదారుఢ్య పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే, గర్భిణీలు, బాలింతలు ఈ పరీక్షకు హాజరయ్యే పరిస్థితి లేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించగా.. వీరికి మరో అవకాశం కల్పించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు టీఎస్ఎల్‌పీఆర్‌బి నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రస్తుతం హాజరుకాకపోయినా పర్వాలేదని తెలిపింది. ప్రిలిమ్స్ పాస్ అయిన వారు నేరుగా ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకోసం సదరు మహిళా అభ్యర్థులు మెడికల్ సర్టిఫికెట్ల తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది నియామక బోర్డ్. ఈ అవకాశం పొందాలంటే మెడికల్ సర్టిపికెట్స్‌తో పాటు అవసరమైన ద్రువపత్రాలతో ఫిబ్రవరి 28వ తేదీ లోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటన జారీ చేసింది.

అయితే, ఫైనల్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన సదరు మహిళలు.. దేహదారుఢ్య పరీక్షలో తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేసింది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్. ఇక ఈ ఫిజికల్ టెస్ట్ సందర్భంగా మెడికల్ సర్టిపికెట్స్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గర్భిణీ స్త్రీలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయా జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టారు. 2022 సెప్టెంబర్ లో పోలీస్ నోటిఫికేషన్​లో దరఖాస్తు చేసుకున్న మహిళలు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి ఈవెంట్స్​కు హాజరు కావాల్సి ఉంది. అయితే, మహిళా అభ్యర్థుల్లో కొంతమంది గర్భిణీ స్త్రీలు కావడం, మరికొంతమంది బాలింతలు కావడంతో తమకు మరోసారి అవకాశం కల్పించాలని పోలీసు నియామక బోర్డ్‌ని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇదే విషయంపై 11 మంది మహిళలు కోర్టుకు వెళ్లగా.. వారికి అనుమతి ఇచ్చారు. తమకు కూడా అలాగే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు సదరు మహిళలు. వీరి అభ్యర్థనకు స్పందించిన పోలీసు నియామక బోర్డ్.. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు మరోసారి అవకాశం కల్పిస్తూ శుభవార్త చెప్పింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..