Army Jobs: అగ్నిపథ్‌ కింద ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ వారికి అవకాశం.

అగ్నిపథ్‌ పథకం కింద 2023-24 ఏడాదిగాను పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్‌లో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి...

Army Jobs: అగ్నిపథ్‌ కింద ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ వారికి అవకాశం.
Indian Army Nursing Assistant
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 17, 2023 | 9:43 AM

అగ్నిపథ్‌ పథకం కింద 2023-24 ఏడాదిగాను పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్‌లో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తో పాటు అండమాన్ నికోబార్, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. ఏయే క్యాటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* అభ్యర్థుల వయసు 17 1/2 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 2000 నుంచి అక్టోబర్ 1, 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2/ఇంటర్మీడియట్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ,జువాలజీ, ఇంగ్లీష్)లో కనీసం 50 శాతం మార్కులు, ప్రతి సబ్జెక్ట్ లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

* ఇక శారీరక ప్రమాణాల విషయానికొస్తే.. ఎత్తు 165 సెం.మీ, ఛాతీ గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించేలా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు,ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమవుతుండగా, మార్చి 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్షను ఏప్రిల్‌ 17వ తేదీన నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే