Group -2: నిరుద్యోగులకు అలర్ట్.. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ.. ఇక పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సిందే..

తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్ -1, కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా.. తాజాగా గ్రూప్ -2, గ్రూప్..

Group -2: నిరుద్యోగులకు అలర్ట్.. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ.. ఇక పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సిందే..
TSPSC
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 17, 2023 | 7:42 AM

తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్ -1, కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా.. తాజాగా గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 ఉద్యోగాలకూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి 5,51,901 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటికి జనవరి 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చివరి మూడు రోజుల్లో 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసే సమయానికి చివరి 24 గంటల వ్యవధిలో 68 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.

ఈ అప్లికేషన్ల ప్రకారం.. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీపడనున్నారు. గ్రూప్‌-2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ త్వరలోనే ఖరారు చేయనుంది. గ్రూప్‌-2 ఉద్యోగ ప్రకటన సమయంలోనూ రాతపరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని పేర్కొనలేదు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్‌ వెల్లడించింది. అయితే కొందరి ఫీజు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తటంతో… అప్లికేషన్ల సంఖ్యలో స్వల్ప మార్పులుండే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.

మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా… వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్‌ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. మొత్తంగా ఈ నోటిఫికేన్ లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. గ్రూప్ 2 పరీక్షను మొత్తం 600 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్‌ ఛాయిల్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌ పరీక్ష కాల పరిమితి రెండున్నర గంటలు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..