TS TET 2024 Exam Schedule: టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. తెలంగాణ టెట్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! పూర్తి షెడ్యూల్‌ ఇదే

|

May 05, 2024 | 2:22 PM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) పరీక్షల షెడ్యూల్‌ విద్యాశాఖ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్‌ పరీక్ష జరుగుతుందో.. లేదోనని గతకొంతకాలంగా అభ్యర్ధుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం టెట్‌ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మే 27వ తేదీన పట్టభద్ర ఎన్నికలు జరగనుండటంతో ఈ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా విద్యాశాఖ షెడ్యూల్‌ను..

TS TET 2024 Exam Schedule: టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. తెలంగాణ టెట్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! పూర్తి షెడ్యూల్‌ ఇదే
TS TET 2024 Exam Schedule
Follow us on

హైదరాబాద్‌, మే 5: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) పరీక్షల షెడ్యూల్‌ విద్యాశాఖ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్‌ పరీక్ష జరుగుతుందో.. లేదోనని గతకొంతకాలంగా అభ్యర్ధుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం టెట్‌ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మే 27వ తేదీన పట్టభద్ర ఎన్నికలు జరగనుండటంతో ఈ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా విద్యాశాఖ షెడ్యూల్‌ను రూపొందించింది.

పేపర్‌ 2 పరీక్షలు మే 20 నుంచి జూన్ 2 వ రకు ఆయా తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి. మే 24వ తేదీన మైనర్‌ మీడియంలో సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 1 తేదీన మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు మైనర్‌ మీడియంలో పరీక్షలు జరుగుతాయి.పేపర్‌ 1 పరీక్షలు మే 30 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో జరుగుతాయి. జూన్‌ 2న ఇంగ్లిష్‌, తెలుగు మీడియంలలో పేపర్‌ 1 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది.

తెలంగాణ టెట్‌ 2024 పరీక్షల కొత్త షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

విద్యాశాఖ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపింది. జూన్ 6వ తేదీతో పరీక్షలు ముగుస్తాయని వెల్లడించింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలన్నీ జూన్ 2వ తేదీతోనే పూర్తి కానున్నాయి. పోలింగ్‌ జరిగే రోజున (ఏప్రిల్ 27వ తేదీన) మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఈ ఏడాది మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో పేపర్ 1 పరీక్షకు 99,210 మంది దరఖాస్తు చేసుకోవగా.. పేపర్‌-2 పరీక్షకు 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.