TS TET 2023 Results: భారీగా పడిపోయిన తెలంగాణ టెట్-2023 ఉత్తీర్ణత శాతం.. పేపర్‌లో 2లో కేవలం 15 శాతమే పాస్‌

|

Sep 28, 2023 | 10:30 AM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) ఫలితాలు బుధవారం (సెప్టెంబర్‌ 27) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా టెట్‌ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన (2011) తర్వాత నుంచి పరిశీలిస్తే తొలిపారి పేపర్‌-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఆ పేపర్‌లో కేవలం 15.30 శాతం మందే కనీస మార్కులు సాధించడం చర్చణీయాంశమైంది. ఇక పేపర్‌-1లో గతేడాది కంటే 4 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతంలో జరిగిన ఏడు సార్లు పరీక్షలతో పోల్చితే పేపర్‌ 1లో కూడా ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది..

TS TET 2023 Results: భారీగా పడిపోయిన తెలంగాణ టెట్-2023 ఉత్తీర్ణత శాతం.. పేపర్‌లో 2లో కేవలం 15 శాతమే పాస్‌
TS TET 2023 Results
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్ 28: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) ఫలితాలు బుధవారం (సెప్టెంబర్‌ 27) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా టెట్‌ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన (2011) తర్వాత నుంచి పరిశీలిస్తే తొలిపారి పేపర్‌-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఆ పేపర్‌లో కేవలం 15.30 శాతం మందే కనీస మార్కులు సాధించడం చర్చణీయాంశమైంది. ఇక పేపర్‌-1లో గతేడాది కంటే 4 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతంలో జరిగిన ఏడు సార్లు పరీక్షలతో పోల్చితే పేపర్‌ 1లో కూడా ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. కాగా సెప్టెంబర్ 15వ తేదీన తెలంగాణ టెట్‌ 2023 నిర్వహించగా.. దీని ఫలితాలు బుధవారం ఉదయం విద్యాశాఖ వెలువరించింది. పేపర్‌-1లో 82,489 మంది అంటే 36.89 శాతం ఉత్తీర్ణత పొందగా.. పేపర్‌-2లో కేవలం 29,073 మంది (15.30) మాత్రమే అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈసారి పరీక్ష ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చినట్లు పరీక్ష రోజునే అభ్యర్ధులు తెలిపారు. పేపర్‌-2 ప్రశ్నపత్రం మరింత కఠినంగా ఉందని, పేపర్‌-1 మాత్రం కాస్త సులభంగా ఉందని కొందరు పేర్కొన్నారు. తాజా ఫలితాలు కూడా ఆ విషయాన్ని దృవీకరిస్తున్నాయి.

రాష్ట్రంలో గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్‌ ఇతర పోటీ పరీక్షల దృష్ట్యా సన్నద్ధత అంతగా జరగలేదని, అందువల్లనే టెట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా టెట్‌లో వచ్చిన మార్కులకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారనే సంగతి తెలిసిందే. పైగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. అందుకే ప్రతిసారీ అధిక శాతం అభ్యర్థులు టెట్‌ పరీక్ష రాస్తున్నారు.

ఉదయం 10 గంటలకు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినప్పటికీ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉత్తీర్ణత శాతం అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. పైగా జిల్లాల వారీగా, సామాజిక వర్గాలు, జండర్‌ ఆధారంగా ఉత్తీర్ణత శాతం వివరాలను ఇచ్చేందుకు కూడా విద్యాశాఖ నిరాకరించింది. పరీక్ష జరిగిన రోజు జిల్లాల వారీగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలు, హాజరు శాతాన్ని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం ససేమిరా అనడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా టెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహించగా.. ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, మిగిలిన వారికి 60 మార్కులు వస్తేనే ఉత్తీర్థత సాధించినట్లు పరిగణిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.