TS TET 2022: తెలంగాణ టెట్‌ అభ్యర్ధులకు గమనిక! ఓఎమ్ఆర్‌ షీట్‌లో సమాధానాలు ఏ పెన్నులతో రాయాలో తెలుసా..

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఐతే పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో గడులను నింపడానికి ..

TS TET 2022: తెలంగాణ టెట్‌ అభ్యర్ధులకు గమనిక! ఓఎమ్ఆర్‌ షీట్‌లో సమాధానాలు ఏ పెన్నులతో రాయాలో తెలుసా..
Omr Sheet

Updated on: Jun 08, 2022 | 4:56 PM

TS TET 2022 Exam date: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఐతే పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో గడులను నింపడానికి నల్ల ఇంకు బాల్‌ పాయింట్ పెన్నులను మాత్రమే వాడాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెక్రటరీ (NCERT) రాధారెడ్డి మంగళవారం (జూన్‌ 7) ఓ ప్రకటనలో తెలిపారు. కాగా తెలంగాణ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. టెట్‌ పరీక్ష అనంతరం వీటి ఫలితాలు ఈ నెలలో 27న విడుదలవ్వనున్నాయి.

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022కు ఈసారి రెండు పేపర్లు రాసేవారే అధిక సంఖ్యలో ఉన్నారు. పేపర్‌ 1 పరీక్ష రాసేందుకు బీఈడీ అభ్యర్ధులకు కూడా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పేపర్‌ 1, పేపర్‌ 2లకు కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.