Telangana SSC Exams 2023: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! ఈ సారి కూడా 6 పేపర్లే..

|

Nov 01, 2022 | 6:14 PM

గత విద్యా సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలను ఆరు పేపర్ల తోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు..

Telangana SSC Exams 2023: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! ఈ సారి కూడా 6 పేపర్లే..
Telangana
Follow us on

గత విద్యా సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలను ఆరు పేపర్ల తోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. గతేడాది పది పబ్లిక్‌ పరీక్షల్లో 11 పేపర్లను 6కు కుదించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడది కూడా పదో తరగతి పరీక్ష 2023ను ఆరు పేపర్లకే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

కాగా 2021లో కరోనా మహమ్మారి కారణంగా 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది కోవిడ్ ఉద్ధృతి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో పదో తరగతి విద్యార్ధులందరినీ ఆల్ పాస్‌ అని ప్రకటించింది. ఇక 2022లో 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు 2023లోనూ ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రతి ఏడాది ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది నవంబర్ 1 నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఈ కింది తేదీల్లో జరగనున్నాయి. టైం టేబుల్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

Whatsapp Image 2022 10 13 At 20.40.15

Whatsapp Image 2022 10 13 At 20.40.15 (1)