TS Polycet 2022 application last date: తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022) నోటిఫికేషన్ మార్చి 24న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం పాలిసెట్‌కు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మే 9 (సోమవారం) నుంచి ప్రారంభమయింది. జూన్ 4తో దరఖాస్తు ప్రక్రియ ముగాయనుండగా.. అభ్యర్ధుల వినతిమేరకు జూన్ 6 వరకు తెలంగాణ పాలిసెట్ చివరి తేదీని పొడిగిస్తున్నట్లు తాజాగా ఎస్‌బీటీఈటీ (SBTET) తెల్పింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ polycetts.nic.inలో రేపటి వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు.. జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250ల చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన 12 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా పాలీసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో నడుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.
పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పాలీసెట్ 2022కు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.