TS Inter Academic Calendar: కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలకంటే ఎక్కువుగా విద్యా రంగంపై పడిందని చెప్పవచ్చు. విద్యార్థులు ఎక్కువగా ఆన్ లైన్ లో చదువులను ఆశ్రయిస్తున్నారు. పరీక్షలు లేకుండానే పాస్ అవుతున్నారు.. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు మళ్ళీ చదువులపై దృష్టి పెట్టింది. పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు నడుమ పాఠశాలలు, కాలేజీలు తెరవడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపధ్యంలో తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్ పై కసరత్తు పూర్తి చేసింది.
తెలంగాణ ఇంటర్ బోర్డు ఈసారి అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించే అలోచనలో ఉంది. దసరా సెలవుల కంటే ముందు అక్టోబర్ చివరి వారం లో హాఫ్ ఇయర్లి ఎక్సమ్స్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. అంతేకాదు.. 2022 మార్చి నాలుగో వారం నుండి ఏప్రిల్ రెండో వారం వరకు ఇంటర్ వార్షిక పరీక్షలని నిర్వహించనున్నారు. మార్చి 23 నుండి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు ఈ మేరకు ఇంటర్ బోర్డు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు మే చివరలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలును నిర్వహించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు జులై ఒకటి నుండి చివరి పనిదినం మధ్య 220 పని దినాలు ఉండే విదంగా క్యాలెండర్ ను రూపొందించారు. పనిదినాలు 220 ఉండడం కోసం దసరా , సంక్రాంతి సెలవులు తగ్గించారు.
ఇక ఇంటర్ విద్యార్థులకు జనవరి లో ప్రీ ఫైనల్స్ నిర్వహించనుండగా.. ఫిబ్రవరి లో చివరి వారం లో ప్రాక్టీకల్స్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు. ఇక ఈవిద్యా సంవత్సరం లో కూడా విద్యార్థులకు 70 శాతం సిలబస్ ను మాత్రమే బోధించనున్నారు.