TS govt jobs 2022: తెలంగాణ నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాల భర్తీకి నేడో, రేపో ఉత్తర్వులు

|

Jun 19, 2022 | 7:15 AM

తెలంగాణ నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాల భర్తీకి శనివారం (జూన్‌ 19) ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం పోస్టుల్లో 704 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (AE) పోస్టులున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో..

TS govt jobs 2022: తెలంగాణ నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాల భర్తీకి నేడో, రేపో ఉత్తర్వులు
Telangana
Follow us on

TS Irrigation Dept job notification to release soon: తెలంగాణ నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాల భర్తీకి శనివారం (జూన్‌ 19) ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం పోస్టుల్లో 704 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (AE) పోస్టులున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలినవి 227 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (AEE) పోస్టులు. బీటెక్‌ చదివిన అభ్యర్ధులు ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాగా నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖల్లో భర్తీ చేయనున్న ఇంజనీరింగ్‌ పోస్టులన్నింటిని టీఎస్పీఎస్సీ (TSPSC) ద్వారా ఒకేసారి భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్‌ త్వరలో నీటిపారుదల శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ్కి చర్యలు చేపడుతోంది.

  1. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మొత్తం పోస్టులు: 704

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • మెకానికల్‌ ఇంజనీర్ పోస్టులు: 84
  • సివిల్‌ ఇంజనీర్ పోస్టులు: 320
  • అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 100
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 200 కలిపి 704 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు.

జోన్ల వారీగా ఇలా..

ఇవి కూడా చదవండి
  • మల్టీజోన్‌-1 (కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు)లో భర్తీ చేయనున్న పోస్టులు: 259
  • మల్టీజోన్‌-2 (యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు)లో భర్తీ చేయనున్న పోస్టులు: 445

2. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మొత్తం పోస్టులు: 227

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • సివిల్‌ ఇంజనీర్ పోస్టులు: 182
  • మెకానికల్‌ ఇంజనీర్ పోస్టులు: 45

జోన్ల వారీగా ఇలా..

  • మల్టీజోన్‌-1 (కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు)లో భర్తీ చేయనున్న పోస్టులు: 112
  • మల్టీజోన్‌-2 (యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు)లో భర్తీ చేయనున్న పోస్టులు: 115

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.