Telangana: వర్సిటీల్లో 600లకు పైగా జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు.. టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4 ద్వారా భర్తీకి కసరత్తులు..

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 12:30 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Assistant posts) భర్తీ బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ టీఎస్‌పీఎస్సీకి అప్పగించనుంది...

Telangana: వర్సిటీల్లో 600లకు పైగా జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు.. టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4 ద్వారా భర్తీకి కసరత్తులు..
Tspsc
Follow us on

TSPSC Group-4 to fill over 600 vacant Junior Assistant posts: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Assistant posts) భర్తీ బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ టీఎస్‌పీఎస్సీకి అప్పగించనుంది. వాటిని గ్రూపు-4 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం విద్యాశాఖ వర్సిటీల్లో ఖాళీలపై కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వద్ద మే 26న జరిగిన సమావేశంలో ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీనివాసరావు హాజరై ఖాళీల వివరాలను అందజేశారు. జూనియర్‌ అసిస్టెంట్ల ఖాళీలు దాదాపు 600 వరకు ఉంటాయని అంచనాకు వచ్చారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌తో సమానమైన జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులను (Junior Stenographer Posts) కూడా అందులో చేర్చాలా? వద్దా? అన్న ప్రశ్న తలెత్తింది. స్టెనోగ్రాఫర్‌ పోస్టు టెక్నికల్‌కు సంబంధించింది అయినందున వాటిని గ్రూపు-4లో చేర్చకపోవచ్చని భావిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి