Professional Courses: చాలా రాష్ట్రాల ఇంటర్ లేదా 12 వ బోర్డు ఫలితాలు వచ్చేశాయి. విద్యార్థులు తరువాతి చదువుల కోసం ప్రవేశాలకు సన్నాహాలు ప్రారంభించారు. ఇంటర్ తరువాత నిజమైన విద్య ప్రారంభమవుతుందని, దీనిపై విద్యార్థుల కెరీర్ చాలా వరకు ఆధారపడి ఉంటుందని విద్యా నిపుణులు చెబుతారు. చాలా మంది విద్యార్థులు కుటుంబ సభ్యులు, బంధువుల నుండి వైద్యులు లేదా ఇంజనీర్లు కావాలని సలహాలు పొందుతారు. కానీ, డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా, మీరు మంచి వృత్తిని చేయగల అనేక వృత్తులు ఉన్నాయి. వాటిలో చేరడం ద్వారా కుడా ఉన్నతమైన భవిష్యత్ కు పునాది వేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఉత్సాహం ఉన్నవారికోసం ఈ ప్రొఫెషనల్ కోర్సులు చాలా ఉపయోగపడతాయి. వీటిలో చేరడానికి ఇంటర్ లో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేదు. ఏ స్ట్రీమ్ విద్యార్థులైనా ఈ కోర్సులలో అడ్మిషన్ తీసుకోవచ్చు.
1. ఫోటోగ్రఫీ
ప్రస్తుతం ఫోటోగ్రఫీ ఒక ప్రముఖ కోర్సుగా మారింది. 10-12 వ పాస్ అయినవారు ఎవరైనా ఈ కోర్సు చేయవచ్చు. అత్యుత్తమ విషయం ఏమిటంటే అందులో ఆచరణాత్మక(ప్రాక్టికల్) విషయాలు ఉన్నాయి. ప్రాక్టికల్ విషయాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు, ఇది మంచి కోర్సుగా ఉంటుంది. ఫోటోగ్రఫీ వృత్తిలో మంచి డబ్బు కూడా సంపాదించే మార్గాలున్నాయి. మీరు ఫ్యాషన్ నుండి వెడ్డింగ్ అదేవిధంగా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ఏదైనా ప్రభుత్వ సంస్థలో పని చేయవచ్చు. అక్కడ ఫోటోగ్రఫీ డైరెక్టర్ (DOP) వంటి ఉన్నత పోస్ట్‌కు చేరుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోర్సులు ప్రభుత్వం నుండి ప్రైవేట్ సంస్థల వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీరు అడ్మిషన్ కోసం ఎక్కువ ప్రయత్నం చేయనవసరం లేదు. మంచి సృజనాత్మకత ఉన్నవారికి ఈ కోర్సు చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు.
2. హోటల్ నిర్వహణ
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుతో మీరు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మంచి ఉద్యోగం పొందవచ్చు. హోటల్ నిర్వహణ రంగం చాలా పెద్దది. ఇంటర్ తర్వాత ఈ కోర్సు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో కూడా చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత, మీరు హోటల్ ఆపరేషన్స్ మేనేజర్, ఈవెంట్ ప్లానర్ అలాగే చెఫ్ కావచ్చు.
3. పర్యాటకం
పర్యాటక పరిశ్రమ రోజురోజుకు పెద్దదవుతోంది. ట్రావెల్, టూరిజం కోర్సులు ప్రయాణం చేయడానికి ఇష్టపడే విద్యార్థులకు సరైన ఎంపిక. BA ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, BA ఇన్ టూరిజం స్టడీస్ మొదలైన కోర్సులు చేయడం ద్వారా మీరు ఈ రంగంలో కెరీర్‌ను పొందవచ్చు. కోర్సు చేసిన తర్వాత మీరు ట్రావెల్ ఏజెంట్, టూరిజం మేనేజర్, టూరిస్ట్ గైడ్, ట్రావెల్ రైటర్ మొదలైన ఉద్యోగాలు పొందగలుగుతారు.
ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!
Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!
Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..