Guntur DCCB Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని ది గుంటూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (ఏడీసీసీబీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్కులు (61), అసిస్టెంట్ మేనేజర్లు (06) ఖాళీలు ఉన్నాయి.
* స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంగ్లిష్ నైపుణ్యంతో పాటు స్థానిక భాషలో ప్రొషిషియన్సీ ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎకనమిక్స్/ స్టాటిస్టిక్స్/ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 01-10-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ పరీక్షను 100 మార్కులకి నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌లో ఉండే పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 03-12-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: సత్యదేవ్ నయా మూవీ “స్కైల్యాబ్” నుంచి లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘రారా లింగా’.. పాట..
Telangana: 100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్