THDC Jobs: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 135 అప్రెంటిస్‌ ఖాళీలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

రిషికేశ్‌లోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్‌.. 135 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన..

THDC Jobs: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 135 అప్రెంటిస్‌ ఖాళీలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
THDC India Limited Recruitment 2022

Updated on: Dec 06, 2022 | 5:55 PM

రిషికేశ్‌లోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్‌.. 135 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు డిసెంబర్‌ 30, 2022వ తేదీలోపు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 30, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. విద్యార్హతలు ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నిబంధనల మేరకు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

టెహ్రీ జిల్లాలో..

  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఖాళీలు: 26
  • స్టెనోగ్రాఫర్/సెక్రటేరియల్ అసిస్టెంట్ ఖాళీలు: 26
  • వైర్‌మ్యాన్‌ ఖాళీలు: 5
  • ఫిట్టర్‌ ఖాళీలు: 7
  • ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 19
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఖాళీలు: 4
  • వెల్డర్ ఖాళీలు: 2
  • మెకానిక్‌ (డిజిల్‌) ఖాళీలు: 2
  • మెకానిక్‌ (మోటర్ వెహికల్‌) ఖాళీలు:2
  • మెకానిక్‌ (ఎర్త్‌ మువింగ్‌ మెషినరీ) ఖాళీలు: 2
  • మెకానిక్‌ (ఆర్ అండ్‌ ఎమ్‌ ఆఫ్‌ హెవీ వెహికల్‌) ఖాళీలు:2
  • మెకానిక్‌ (ఆర్ అండ్‌ ఎమ్‌ ఆఫ్‌ వెహికల్‌) ఖాళీలు: 3

కోటేశ్వర్‌ జిల్లాలో..

  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఖాళీలు: 15
  • ఫిట్టర్‌ ఖాళీలు: 5
  • ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 8
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఖాళీలు: 4
  • మెకానిక్‌ (డిజిల్‌, మోటర్ వెహికల్‌, ఎర్త్‌ మువింగ్‌ మెషినరీ, ఆర్ అండ్‌ ఎమ్‌ ఆఫ్‌ హెవీ వెహికల్‌ అండ్‌ వెహికల్‌) ఖాళీలు: 3

అడ్రస్:

AGM (HR&A),
THDC India Limited,
Administrative Building,
Bhagirathipuram,
Tehri Garhwal-249124

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.