TGWDEW Recruitment 2021: 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహితులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

| Edited By: Anil kumar poka

Jul 17, 2021 | 2:57 PM

TGWDEW Recruitment 2021: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 వ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. అశ్వారావు పేట, దమ్మపేట మండలంలో అంగన్ వాడీ కేంద్రాలోని పలు పోస్టుల..

TGWDEW Recruitment 2021: 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహితులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Wdcw Telangana
Follow us on

TGWDEW Recruitment 2021:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 వ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. అశ్వారావు పేట, దమ్మపేట మండలంలో అంగన్ వాడీ కేంద్రాలోని పలు పోస్టుల భర్తీ కోసం సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మండలాల్లో ఖాళీలు ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను వెబ్ సైట్ https://mis.tgwdew.in  ద్వారా తెలుసుకోవచ్చు.  అభ్యర్ధినీలు ఆన్ పైన్ ద్వారా ధరఖాస్తు  చేసుకోవాలంటే..  https://mis.tgwdcw.in/Recruit.aspx ద్వారా చేసుకోవాల్సి ఉంది. అంతేకాదు ఈ వెబ్ సైట్స్ ద్వారా ఆసక్తికలిగిన అభ్యర్ధినీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధినీలు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు..

అశ్వారావుపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 01, ఆయా పోస్టులు 03, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02, దమ్మపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 03, ఆయా పోస్టులు 13, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02 ఖాళీలు ఉన్నట్లు సీడీపీఓలు రేవతి, రోజా రాణిలు తెలిపారు.

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత (అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. అంతేకాదు స్థానికంగా గ్రామం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణం అయితే స్థానిక మున్సిపాలిటీ వార్డులో నివసిస్తూ ఉండాలి).

వయస్సు : 35 ఏళ్ళు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  3 నెలల తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయం.. స్వామిని దర్శించుకోవాలంటే కండిషన్స్ అప్లై

మాట నిలబెట్టుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ప్రశంసించిన కేటీఆర్.. ట్వీట్స్ వైరల్..

కేజీఎఫ్ సెకండ్ చాప్టర్ వచ్చేది అప్పుడేనా.. అందుతున్న సంకేతాలను బట్టి..

కరోనా కాలపు చదువులు ఇలాగే ఉంటాయి.! వైరల్‌ అవుతోన్న చిన్నారి మాటలు. హోం వర్క్‌ తప్పించుకోవడానికి.