TGSRTC Driver Jobs 2025: రాత పరీక్షలేకుండానే ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు దరఖాస్తు చేశారా..? మరికొన్ని గంటలే ఛాన్స్‌!

Application Last date for TSLPRB Driver and Shramik Jobs 2025: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, శ్రామిక్‌ ఖాళీల భర్తీకి ఇటీవల స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 8, 2025వ తేదీ నుంచే ప్రారంభమైనాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు

TGSRTC Driver Jobs 2025: రాత పరీక్షలేకుండానే ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు దరఖాస్తు చేశారా..? మరికొన్ని గంటలే ఛాన్స్‌!
TSLPRB Driver and Shramik Jobs

Updated on: Oct 27, 2025 | 2:48 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, శ్రామిక్‌ ఖాళీల భర్తీకి ఇటీవల స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) నోటిఫికేషన్విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టులకు ఆన్లైన్దరఖాస్తులు అక్టోబర్‌ 8, 2025 తేదీ నుంచే ప్రారంభమైనాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్దరఖాస్తులకు ముగింపు గడువు మరికొన్ని గంటల్లోనే ముగుస్తుంది. క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అక్టోబర్‌ 28 తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ పేర్కొంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కింది డైరెక్ట్లింక్ద్వారా ఆన్లైన్విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు కింద చెక్చేసుకోండి..

నోటిఫికేషన్కింద మొత్తం 1,743 డ్రైవర్‌, శ్రామిక్‌ ఉద్యోగాలను ఆర్టీసీ భర్తీ చేయనుంది. వీటిల్లో డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్‌ పోస్టులు 743 వరకు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

టీజీఎస్ఆర్‌టీసీలో డ్రైవర్‌, శ్రామిక్‌ ఉద్యోగాల ఆన్లైన్దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్చేయండి.

ఇవి కూడా చదవండి

పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజు కింద డ్రైవర్‌ పోస్టులకు జనరల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున చెల్లించాలి. అలాగే శ్రామిక్‌ పోస్టులకు జనరల్అభ్యర్ధులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఫిజికల్ మెజర్‌మెంట్ (పీఎంటీ), మెడికల్, డ్రైవింగ్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు డ్రైవర్‌ పోస్టులకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు, శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 వరకు జీతంగా చెల్లిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.