హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఎంపికైన అభ్యర్ధుల ఫుల్ జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతిగృహాల్లో మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు గతేడాది జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో (సీబీఆర్‌టీ) రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 82,873 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. కమిషన్ ఇప్పటికే పరీక్షల ఫలితాలను వెల్లడించగా.. తాజాగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది.
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతరం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల వివరాలను వెల్లడించింది. మొత్తం 581 పోస్టులకు గాను 574 మందిని ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టులో జాబితాను ఇచ్చింది. వీరిలో 561 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, లేడీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపిక అయ్యారు. మిగిలిన 13 మంది వార్డెన్, మాట్రన్ గ్రేడ్ 1, గ్రేడ్-2 పోస్టులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఉద్యోగ నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియలను పూర్తి చేసి త్వరలోనే పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షల అడ్మిట్ కార్డులను రైల్వే శాఖ విడుదల చేసింది. సీబీటీ 1 పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయగా మొత్తం 1251 మంది సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించారు. వీరికి మార్చి 19, 20వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటీవలే రైల్వేబోర్డు వెల్లడించింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ రైల్వే లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షల అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.