AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC DEO 2025 Exam Date: డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే.. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్షల తేదీలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను కమిషన్‌ ఈ రోజు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారంతా ఈ పరీక్షకు హాజరుకావచ్చు..

APPSC DEO 2025 Exam Date: డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే.. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్
APPSC DEO 2025 Exam Date
Srilakshmi C
|

Updated on: Mar 18, 2025 | 6:18 AM

Share

అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిమిలినరీ పరీక్షల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మే 25న ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇప్పటికే జారీ చేసింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా వారిలో 18,037 అంటే 82.02 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్‌ పరీక్షల హాల్‌టికెట్లను మార్చి 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.

ఇక మెయిన్స్‌ రాత పరీక్షలు మార్చి 26, 27 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. మెయిన్‌ పరీక్షలు మొత్తం 3 పేపర్లకు జరగనున్నాయి. ఈ మూడు పేపర్లు మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. పేపర్‌ 1 పరీక్ష మార్చి 26 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 పరీక్ష మార్చి 27న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌ 3 పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్‌ పరీక్షల హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..