హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో బి-కేటగిరీ అంటే యాజమాన్య కోటా కింద ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జులై 31 సాయంత్రం సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9వ తేదీలోపు నోటిఫికేషన్ జారీ చేసి, నోటిఫికేషన్ విడుదల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి కనీసం ఆరు రోజులు గడువు ఇస్తున్నట్లు విద్యామండలి పేర్కొంది. ఆగస్టు 29లోపు సీట్ల భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. బీ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థుల పూర్తి వివరాలను సెప్టెంబరు 10వ తేదీలోపు తమకు సమర్పించాలని ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలను ఆదేశించింది.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.11 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 30 శాతం సీట్లను యాజమన్యం కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇందులో 15 శాతం ఎన్‌ఆర్‌ఐలకు కేటాయిస్తారు. ఈ కోటా కింద సీట్లు పొందిన విద్యార్ధులు ఎన్‌ఆర్‌ఐలు సిఫార్సు చేసిన వారై ఉండాలి. మిగిలిన 15 శాతం సీట్లను తొలుత జేఈఈలో ర్యాంకు ఆధారంగా, తర్వాత ఎంసెట్ ర్యాంకు ఆ ధారంగా భర్తీ చేస్తారు. ఈ కోటా కింద ప్రవేశాలు పొందేవారు సంబంధిత సబ్జెక్టుల్లో 45 శాతం కనీస మార్కులు కలిగి ఉండాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు.
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్ నంబర్‌తోపాటు సంబంధిత వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా సీటెట్ పరీక్ష జులై 7వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీఎస్సీ సీటెట్పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. మొత్తం రెండు పేపర్‌లను ఈ పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. రెండో పేపర్ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్స్కోర్కు లైఫ్లాంగ్వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు.