TG TET 2025 Exam Date: టెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025)కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. అయితే చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా చివరి 30 గంటల్లో ఏకంగా 50 వేల వరకు దరఖాస్తులు అందడం విశేషం. ఇక చివరి రెండు గంటల్లోనే 18,492 మంది దరఖాస్తు చేసుకున్నారు..

TG TET 2025 Exam Date: టెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?
TG TET 2025 Exam Date

Updated on: May 02, 2025 | 6:11 PM

హైదరాబాద్‌, మే 2: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025)కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,83,653 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తులు ఈసారి 1.50 లక్షలు దాటకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేసినప్పటికీ.. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా చివరి 30 గంటల్లో ఏకంగా 50 వేల వరకు దరఖాస్తులు అందడం విశేషం. ఇక చివరి రెండు గంటల్లోనే 18,492 మంది దరఖాస్తు చేసుకున్నారు.

మొత్తం దరఖాస్తుల్లో పేపర్‌ 1కు 63,261 మంది, పేపర్‌ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు 15 వేల మంది వరకు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన టెట్‌కు 2,75,775 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి ఏకంగా 92,122 దరఖాస్తులు తగ్గాయి. ఇప్పటికే ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న వారిలో చాలామంది స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు కోసం మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేయడం విశేషం. కాగా టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జూన్‌ 15 నుంచి 30 వరకు జరగనున్నాయి.

మే 4న తెలంగాణ ఈఏపీసెట్‌ ప్రిలిమినరి కీ విడుదల.. మే 6 వరకు అభ్యంతరాల స్వీకరణ

తెలంగాణలో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీని మే 4న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 4 నుంచి 6వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను మే 6వ తేదీ ఉదయం 12 గంటల్లోగా సమర్పించాలని వెల్లడించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 29, 30 తేదీల్లో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్‌ పరీక్షలు మే 2 నుంచి 4 వరకు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.