10th Paper Leak Case 2025: పదో తరగతి పేపర్‌ లీకేజీలో 13 మందిపై కేసు నమోదు.. పరారీలో ఇద్దరు మైనర్లు!

|

Mar 27, 2025 | 5:45 AM

తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు ప్రశ్నపత్రం లీక్‌ కావడం సంచలనంగా మారింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో మార్చి 21న పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది..

10th Paper Leak Case 2025: పదో తరగతి పేపర్‌ లీకేజీలో 13 మందిపై కేసు నమోదు.. పరారీలో ఇద్దరు మైనర్లు!
SSC paper leak
Follow us on

నకిరేకల్‌, మార్చి 27: రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు ప్రశ్నపత్రం లీక్‌ కావడం సంచలనంగా మారింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో మార్చి 21న పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఇది కాస్తా డీఈఓకు చేరడంతో దుమారం రేగింది. వెంటనే ఎంఈవో నాగయ్యకు ఫోన్‌ చేయగా నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏకంగా 13 మంది పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. అందులో 11 మందిని అరెస్ట్‌ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న 13 మందిలో 11 మంది స్నేహితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఏ1 చిట్ల ఆకాశ్, ఏ3 చిట్ల శివ, మరో బాలుడు కలిసి మార్చి 21న ప్లాన్‌ ప్రకారం గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై చేరుకున్నారు. గేట్‌ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో ఈ ముగ్గురు పరీక్ష కేంద్రం వెనుక వైపుకు వెళ్లారు. అక్కడ ఏ11 రాహుల్‌ ఉన్నాడు. అనంతరం బయట నుంచి వచ్చిన బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్‌ నంబరు 8 వద్దకు చేరుకుని, గదిలో పరీక్ష రాస్తున్న వారిలో తనకు పరిచయం ఉన్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నపత్రం చూపించమని సైగ చేశాడు. దీంతో రాహుల్‌కి ఆ విద్యార్థిని ప్రశ్నపత్రం చూపించింది. ఆ బాలుడు తన ఫోన్‌లో ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని కిందకు దిగాడు. ఆ బాలుడు తీసిన ఆ ఫొటో పేపర్‌ను మిగతా నిందితులు ఒకరి నుంచి ఒకరికి ఫోన్‌లో పంపుకున్నారు.

ఏ 4 ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్‌ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయగా, వాటిని రవిశంకర్‌ జెరాక్స్‌ షాప్‌లో జెరాక్స్‌ తీశారు. నిందితులు సమాధాన పత్రాలను వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లగా అక్కడ పోలీసులను చూసి భయంతో వెళ్లిపోయారని పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. ఈ కేసులో రాహుల్‌తోపాటు మరోబాలుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. బంధువుల పిల్లలు ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు పేపర్‌ లీకేజీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.