TG GENCO AE Revised Exam Date: తెలంగాణ జెన్‌కో ‘ఏఈ’ రాత పరీక్ష తేదీ వెల్లడి.. జులై 3 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌

తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), కెమిస్ట్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. జులై 14న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ రిజ్వీ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది..

TG GENCO AE Revised Exam Date: తెలంగాణ జెన్‌కో ఏఈ రాత పరీక్ష తేదీ వెల్లడి.. జులై 3 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
TG GENCO AE Revised Exam Date

Updated on: Jun 13, 2024 | 6:52 AM

హైదరాబాద్‌, జూన్‌ 13: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), కెమిస్ట్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. జులై 14న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ రిజ్వీ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9.00 గంటల నుంచి 10.40 (మెకానికల్‌/ కెమిస్ట్‌) వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 1 గంట నుంచి 2.40 గంటల వరకు (ఎలక్ట్రికల్‌), మూడో షిఫ్ట్ సాయంత్రం 5 గంటల నుంచి 6.40 గంటల వరకు (సివిల్‌/ ఎలక్ట్రానిక్స్‌) జరుగుతుంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు జెన్‌కో తన ప్రకటనలో వెల్లడించింది.

కాగా మొత్తం 339 పోస్టుల భర్తీకి 2023 అక్టోబరు 4న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత రాతపరీక్షను ఈ ఏడాది మార్చి 31న నిర్వహించాలని నిర్ణయించినా ఎన్నికల కోడ్‌ వల్ల అది వాయిదా పడింది. తాజాగా కొత్త తేదీ ప్రకటించిన సంస్థ రాత పరీక్షను జులై 14కు వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. జులై 3 నుంచి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సంస్థ సీఎండీ రిజ్వీ పేర్కొన్నారు.

నేడు తెలంగాణ లాసెట్ 2024 ఫలితాలు.. మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల

తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌-2024 ఫలితాలు జూన్‌ 13 (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదలకానున్నాయి. ఈ మేరకు పరీక్ష ఫలితాలను సెట్‌ నిర్వహణాధికారులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ రోజు విడుదల చేయనున్నారు. తెలంగాణ లాసెట్ పరీక్షను జూన్ 3న నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా న్యాయవిద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ లాసెట్‌ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.