TG DSC 2024 Exam: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ!

|

Jul 17, 2024 | 9:44 AM

తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలిసారి డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 13 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు...

TG DSC 2024 Exam: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ!
TG DSC 2024 Exam
Follow us on

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలిసారి డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 13 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తం 11 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో మొదటిసారి డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతి రోజూ రెండు విడుతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి విడుత ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో విడుత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. పీఈటీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. దివ్యాంగ అభ్యర్థులకు (సదరం సర్టిఫికెట్‌ ఉన్న వారికి మాత్రమే) అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిరోజు 26 వేల మంది చొప్పున అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. కాగా ఇప్పటి వరకు 2.2 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకోవాలి. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అలాగే పరీక్ష సమయానికంటే పది నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమతోపాటు హాల్‌ టికెట్‌, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, బాల్‌ పాయింట్‌ పెన్ను తమ వెంట తెచ్చుకోవాలి. గడియారాలు, మెటల్‌ వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లో అనుమతించరు.

డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

మరోవైపు డీఎస్సీ పరీక్షను వాయిదే వేయాలంటూ అభ్యర్ధులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లో కోరారు. రేపు (గురువారం) ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనున్నది. పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వలేదని, సిలబస్‌ అధికంగా ఉండటంతో వల్ల సరిగ్గా సన్నద్ధంకాలేకపోయామని, అందుకే పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జులై 18 నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సరిగ్గా అదేరోజు హైకోర్టు కేసును విచారించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.