Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు..? మేలో నిర్వహించే ఛాన్స్..?

|

Mar 16, 2022 | 11:52 AM

Telangana Inter Exams: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు..? మేలో నిర్వహించే ఛాన్స్..?
Inter Exams
Follow us on

JEE మెయిన్స్‌ షెడ్యూల్‌ మారింది. మరి ఇంటర్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌(Inter Exams Schedule) కూడా మారుతుందా? దానిపైనే ఇవాళ క్లారిటీ ఇవ్వబోతోంది తెలంగాణ ఇంటర్‌ బోర్డు. మరి రెండోసారి పరీక్ష తేదీల్లో మార్పులు తప్పవా? తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీలపై విద్యా శాఖ పునరాలోచన చేస్తోంది. ఇంటర్‌ పరీక్షల తేదీలపై జేఈఈ (JEE) మెయిన్స్‌ షెడ్యూల్‌ ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో మరోసారి తేదీలు మార్చక తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు.  కానీ JEE మెయిన్‌ పరీక్ష వల్ల ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. అయితే JEE మెయిన్‌ పరీక్షల తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రీ షెడ్యూల్‌ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 16 నుంచి 21 మధ్య JEEజరగాల్సి ఉంది.

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఏపీ ఇంటర్‌బోర్డు అధికారులతో కూడా చర్చించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కొత్త తేదీలను ప్రకటించనున్నారు. ఇంటర్‌ రెండు సంవత్సరాల పరీక్షలు మొత్తం 16 రోజులు జరుగుతాయి. జేఈఈ మెయిన్‌కు ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మాత్రమే హాజరవుతారు.

ఎంపీసీ, బైపీసీ, ఇతర గ్రూపుల ప్రధాన సబ్జెక్టులకు 12 రోజులు పరీక్షలు జరగాలి. ఆ ప్రకారం మే 5వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభిస్తే 18వ తేదీకి అవి ముగుస్తాయి. మధ్యలో రెండు ఆదివారాలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారాల్లో కూడా పరీక్షలు జరిపితే 16వ తేదీతో పూర్తవుతాయి. జేఈఈ మెయిన్‌ చివరి విడత మే 24 నుంచి మొదలవుతుంది. విద్యార్థులు దానికి సిద్ధం కావడానికి మధ్యలో వారం వ్యవధి వస్తుందని భావిస్తున్నారు.

ఒకవేళ సెకండియర్‌తో పరీక్షలు ప్రారంభిస్తే మరొక రోజు వెసులుబాటు లభిస్తుందని కూడా యోచిస్తున్నారు. కానీ మే 4న జేఈఈ మెయిన్‌ రాసిన వారు మర్నాడే ఇంటర్‌ పరీక్ష రాయాలన్నదే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల మండలి  కి విజ్ఞప్తి చేస్తే తేదీల్లో వెసులుబాటు లభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!