IBPS Free Coaching 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్! ఎక్కడంటే..
రాష్ట్ర సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐబీపీఎస్ నిర్వహించే పలు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నిరుపేద నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువత బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా 75 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని

హైదరాబాద్, ఏప్రిల్ 27: నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐబీపీఎస్ నిర్వహించే పలు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నిరుపేద నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువత బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా 75 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని పీఈటీసీ శిక్షణ కేంద్రంలో కోచింగ్ ఇవ్వనున్నారు. మే 20 నుంచి ఈ కోచింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొత్తం వంద మంది అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎస్టీలకు 75 సీట్లు, ఎస్సీలకు 15 సీట్లు, బీసీలకు 10 సీట్లు కేటాయించనున్నారు.
తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ IBPS ఉచిత శిక్షణ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని గిరిజన సంక్షేమశాఖ వెల్లడించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు దాటకూడదు. ఇతర వివరాలకు 040-27540104 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆ శాఖ సూచించింది.
ఏపీ డీఈఈసెట్ 2026 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ డీఈఈసెట్ దరఖాస్తుల గడువునను ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ లింగేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 26తో దరఖాస్తు గడువు ముగిసింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు మరో నాలుగు రోజులు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇక డీఈఈసెట్ 2026 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.
ఏపీ డీఈఈసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




