Telangana Govt Jobs: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాదిలోపు ఏకంగా లక్ష ఉద్యోగాలు భర్తీ!

వచ్చే ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తద్వారా లక్ష మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని..

Telangana Govt Jobs: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాదిలోపు ఏకంగా లక్ష ఉద్యోగాలు భర్తీ!

Updated on: Jul 17, 2025 | 6:29 AM

సూర్యాపేట, జులై 17: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తద్వారా లక్ష మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టారు అని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందించినట్లు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకునేలోగా రాష్ట్రంలో మొత్తం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈ వేదికపై నుంచి మాటిస్తున్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

జులై 24 నుంచి ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIII పరీక్షలు.. త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీరికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIII పరీక్షలు జులై 24 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేయనుంది. కాగా జులై 24, 25, 26, 28, 29, 30, 31, ఆగస్టు 1వ తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. దివ్యాంగ అభ్యర్ధులు స్వంతంగా స్క్రైబ్‌ అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. వారి వివరాలను జులై 20వ తేదీలోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డ్, స్క్రైబ్‌ ఎంట్రీ పాస్‌ పరీక్ష తేదీకి 4 రోజుల ముందు జారీ చేస్తారు.

ఈ నోటిఫికేషన్‌ కింద అప్పర్ డివిజన్ క్లర్క్, డిప్యూటీ రేంజర్, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌, ఫీల్డ్‌మ్యాన్‌, సీనియర్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్‌ డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, లాబొరేటరీ అసిస్టెంట్ తదితర 2,423 పోస్టులను కమిషన్‌ భర్త చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.