TS KGBV 2022: తెలంగాణకు మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు

|

May 11, 2022 | 2:41 PM

వచ్చే విద్యా సంవత్సరం(2022 - 23) నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం అనుమతి..

TS KGBV 2022: తెలంగాణకు మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు
Kgbv
Follow us on

New Kasturba Gandhi Balika Vidyalaya Schools for Girls: వచ్చే విద్యా సంవత్సరం(2022 – 23) నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. కేంద్రం మాత్రం 20 మంజూరు చేసేందుకు అంగీకరించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిలో 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. వీటిని తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడుపుతారు. శాశ్వత భవనాలు వస్తే మిగిలిన తరగతులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 చోట్ల ఇంటర్‌ వరకు విద్య అందిస్తుండగా మిగిలిన వాటిల్లో 6-10 తరగతుల వరకు బోధిస్తున్నారు. తాజాగా మరో 37 కేజీబీవీలను ఇంటర్‌ వరకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించడంతో అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలను ఆదేశించింది. దీంతో కొత్తగా 2,590 ఇంటర్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Also read:

Omega Healthcare: రానున్న 12 నెలల్లో 18,000 నియామకాలు చేపట్టనున్న ఒమేగా హెల్త్‌కేర్‌.. ఎక్కడెక్కడంటే..