Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG TET 2024 Notification: తెలంగాణ టెట్‌ (నవంబర్) 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

రేవంత్ సర్కార్ మాట మీద నిలబడింది. తొలుత చెప్పినట్లు యేటా రెండు సార్లు టెట్ నిర్వహణకు ఉపక్రమించింది. ఈ మేరకు తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024 నవంబర్) 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి..

TG TET 2024 Notification: తెలంగాణ టెట్‌ (నవంబర్) 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
TG TET 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2024 | 8:26 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 5: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024 నవంబర్) 2024 నోటిఫికేషన్‌ సోమవారం (నవంబర్‌ 4) విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి (నవంబర్‌ 5) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక టెట్ ఆన్‌లైన్‌ ఆధారిత కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన వెలువరించింది. టెట్‌కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు టెట్ తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు జూన్ 12న ప్రకటించింది. దాదాపు 2.35 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవగా.. వీరిలో 1.09 మంది అర్హత సాధించారు. తాజాగా రెండో విడత టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్‌ పరీక్షలు జరుపుతామని తెలుపుతూ ఈ ఏడాది ఆగస్టులో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది కూడా. ఈ క్రమంలో నవంబరు 4న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సర్కార్ టెట్‌ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఇప్పటికే డీఎస్సీ నియామక ప్రక్రియ ముగిసింది. అయితే త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని గతంలో పలుమార్లు అధికారులు తెలిపారు. ఏదీఏమైనా ఈ సారి టెట్‌ పరీక్షకు హాజరయ్యే రాసే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌ 1కు డీఈడీ, పేపర్‌ 2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో విధుల్లో ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరో సారి టెట్‌ పరీక్ష జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.