TS Tenth advanced supplementary examinations 2022: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం (జూన్ 30) ప్రకటించారు. ఈ మేరకు సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేశారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు జులై 18వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. హాల్ టికెట్లు త్వరలో విడుదల చేస్తామని, ఆగస్టు 1 నుంచి10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ఈ సందర్భంగా మంత్రి సబితా వెల్లడించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు పరీక్షలు జరుగుతాయి. కాగా జూన్ 30న విడులైన పదో తరగతి ఫలితాల్లో 90 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ పదో తరగతి 2022 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్..
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.