Telangana 10th Class Result Date: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2022 ఫలితాలు ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జుబ్లిహిల్స్‌లోనున్న డా. ఎస్‌సీఆర్ హెచ్‌డీఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో జూన్ 30 ఉదయం11 గంటల 30 నిముషాలకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదగా పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరయిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జూన్ 1తో ముగియగా.. ఆ రెండో రోజు అంటే జూన్ 2 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను జూన్ 30న ప్రకటించాలని విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు. రెండేళ్ల తర్వాత ఈ జరిగిన పదోతరగతి పరీక్షలు జరగడంతో.. వీటి ఫలితాల విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.