Telangana Post Office Recruitment: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాకుల నోటిఫికేషన్‌లు వెలువడుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగాలభర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్ అర్హతగా నిర్ణయించడంతో చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటిఫికేషన్ల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక తాజాగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ కార్యాలయం, హైదరాబాద్ పోస్టల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ సైతం విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు 55
పోస్టల్ అసిస్టెంట్ 11
సార్టింగ్ అసిస్టెంట్ – 8
పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్ – 26
ఎంటీఎస్ – 10
పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తప్పనిసరిగా 12 వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
పోస్ట్‌మ్యాన్: 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పని సరిగా స్థానిక భాష్ (తెలుగు) వచ్చి ఉండాలి. కనీసం పదో తరగతి వరకు టెన్త్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి. ఉద్యోగం పొందిన రెండేళ్లలోగా టూ వీలర్ లేదా లైట్ మోటార్ వెహికిల్, త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.
ఎంటీఎస్: పదో తరగతిపాసై లోకల్ లాంగ్వేజ్(తెలుగు) వచ్చిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగును ఓ సబ్జెక్టును కలిగి ఉండాలి.
క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అలాగే పోస్ట్‌మ్యాన్, మేల్ గార్డ్: ఈ ఉద్యోగాలకు కూడా 18-27 ఏళ్లును వయో పరిమితిగా నిర్ణయించారు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. ఎంటీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న వారి వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్, ఆధార్, చిరునామా, విద్యార్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు కావాల్సిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.