హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష తేదీ రెండు రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.
ఏపీఈఏపీ సెట్-2024 పరీక్షలు మే 21న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఈ పరీక్షకు మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం సెషన్‌లో 29,904 మందికి గానూ 28,087 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 30,518 మందికి గానూ 28,895 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఈ లెక్కన మొత్తం 94.31శాతం హాజరయ్యారని ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.