Telangana 10th Class Results: పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. మార్కుల మెమో డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

Telangana SSC Board Exam Results 2026: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.30 లక్షల మంది విద్యార్దులు గత నెల రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలతాలు ఈ రోజు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు చేతుల మీదగా ఫలితాలు వెల్లడించారు. విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకోండి..

Telangana 10th Class Results: పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. మార్కుల మెమో డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
TS SSC 10th Class Results

Updated on: Apr 29, 2026 | 2:10 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లో అమ్మాయిలే టాప్‌ మార్కులు సాధించారు. మొత్తం విద్యార్ధుల్లో 95.15 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ లింక్‌లోనూ డైరెక్ట్‌గా మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026ఇక్కడ చెక్‌ చేసుకోండి..

వాట్సప్‌లోనూ పదో తరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లతోపాటు వాట్సాప్‌లోనూ పదో తరగతి ఫలితాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్‌ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపి, ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే స్క్రీన్‌పై మార్కుల మోమో ప్రత్యక్షమవుతుంది.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 14న నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు కొనసాగింది. కేవలం 7 రోజుల్లోనే మార్కుల ఎంట్రీ ప్రాసెస్‌ను పూర్తిచేసిన విద్యాశాఖ వేగంగా ఫలితాలను వెల్లడించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us