
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. నేటి ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్ధులు పాస్ అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో దాదాపు 99.1 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం 5,26,166 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,91,774 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. 5,538 మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు.
ఫెయిలైన విద్యార్దులకు జూన్ 5, 2026వ తేదీ నుంచి జూన్ 12, 2026వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీల్లో ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్ధులు ఏప్రిల్ 30 నుంచి మే 14, 2026 తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో మరో రెండు రోజుల వరకు గడువు ఉంటుంది.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 30, 2026వ తేదీ నుంచి మే 14, 2026వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో విద్యార్ధులు ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటికంగ్‌కు రూ.500, రీ- వెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.