School Holidays: ఈ నెలలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే!

|

Nov 14, 2023 | 9:55 PM

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ జరగనున్నందున్న సంగతి తెలిసిందే. దీంతో నవంబర్‌ 30వ తేదీతోపాటు ఆ ముందు రోజు ప్రభుత్వ పాఠశాలలకు తెలంగాణ విద్యాశాఖ వర్గాలు సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. దీంతో పోలింగ్‌ కేంద్రాలుగా నిర్ణయించింన ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందురోజు మధ్యాహ్నం నుంచే చేరుకోవాలని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈవీఎంలను తీసుకునేందుకు..

School Holidays: ఈ నెలలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే!
School Holidays
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 14: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ జరగనున్నందున్న సంగతి తెలిసిందే. దీంతో నవంబర్‌ 30వ తేదీతోపాటు ఆ ముందు రోజు ప్రభుత్వ పాఠశాలలకు తెలంగాణ విద్యాశాఖ వర్గాలు సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. దీంతో పోలింగ్‌ కేంద్రాలుగా నిర్ణయించింన ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందురోజు మధ్యాహ్నం నుంచే చేరుకోవాలని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈవీఎంలను తీసుకునేందుకు నవంబర్‌ 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

అందువల్ల నవంబర్‌ 29, 30 తేదీల్లో బడులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు. పోలింగ్‌ పూర్తయ్యి ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్ధరాత్రి దాటుతుంది. అందువల్ల పోలీంగ్‌ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు డిసెంబరు 1వ తేదీన కూడా సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు వినతి పత్రాన్ని సమర్పించారు.

మరో 10 రోజుల్లో 80 వేల ఖాళీలకు నోటిఫికేషన్‌.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ మొత్తం 80 వేల ఉద్యోగాలకు మరో 10 రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వనుంది. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం త్వరలో ఈ ఉద్యోగాలను ఎస్సె్స్సీ భర్తీ చేయనుంది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్, రామ్‌కీ ఫౌండేషన్‌ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మొందుకొచ్చాయి. ఆసక్తి కలిగిన యువతీయువకులు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్‌లు న‌వంబ‌రు 26న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాయి. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు నవంబర్ 29న ప్రకటిస్తాయి. అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2వ తేదీ నుంచి అయిదు నెలల పాటు ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌ అందించి శిక్షణ ఇవ్వనున్నారు. అసక్తి కలిగిన వారు 9703651233, 7337585959, 9000797789ని సంప్రదించవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

కాగా నవంబర్‌ 24న కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28వ తేదీతో ముగియనున్నాయి. కానిస్టేబుల్ (గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 తేదీల్లో.. అలాగే మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లోనూ దేశవ్యాప్తంగా ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.