TG Polycet 2024 Topers List: తెలంగాణ పాలిసెట్‌ 2024 టాప్‌ ర్యాంకర్లు వీరే.. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్‌ షురూ

|

Jun 04, 2024 | 4:37 PM

తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్‌లో 84.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 82,809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. వారిలో 69,728 మంది అర్హత సాధించారు. ఈ మేరకు తెలంగాణ పాలిసెట్‌ 2024 ఫలితాలను విద్యాశాఖ చీఫ్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం జూన్‌ 3న ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా..

TG Polycet 2024 Topers List: తెలంగాణ పాలిసెట్‌ 2024 టాప్‌ ర్యాంకర్లు వీరే.. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్‌ షురూ
TG Polycet 2024 Topers List
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 4: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్‌లో 84.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 82,809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. వారిలో 69,728 మంది అర్హత సాధించారు. ఈ మేరకు తెలంగాణ పాలిసెట్‌ 2024 ఫలితాలను విద్యాశాఖ చీఫ్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం జూన్‌ 3న ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56 ప్రభుత్వ, 62 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉండగా.. వీటిల్లో 32,614 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక గత ఏడాది షాద్‌నగర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు చేయగా.. అందులో 240 సీట్లను ఈసారి పాలీసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని ఇంజినీరింగ్‌ కాలేజీగా ఉన్నతీకరించినట్లు ఆయన తెలిపారు. దీంతో రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీగా ఇది అవతరించినట్లు ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ పాలిసెట్‌ 2024 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే..

  • ఎంపీసీ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన తూమాటి హరీశ్‌ 120 మార్కులతో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు.
  • రంగారెడ్డికి చెందిన కటకం లలిత్‌ మనోహర్‌ సెకండ్‌ ర్యాంకు (119), మహబూబ్‌నగర్‌కు చెందిన జి భవిత సెకండ్ ర్యాంకు (119), సూర్యాపేటకు చెందిన గోపగాని శ్రీనిజ సెకండ్‌ (119) ర్యాంక్‌ సాధించారు.
  • ఇక ఎంబైపీసీ విభాగంలో సూర్యాపేటకు చెందిన గోపగాని శ్రీనిఖ 119.5 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. సూర్యపేటకు చెందిన సామ అశువర్ధన్‌ రెడ్డి 118 మార్కులతో సెకండ్ ర్యాంకు, మహబూబ్‌నగర్‌కు చెందిన జి భవిత 117.5 మార్కులతో థార్డ్‌ ర్యాంక్‌ సాధించారు.

జూన్‌ 20వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. పాలిటెక్నిక్‌ తరగతులు జులై 18 నుంచి మొదలవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.