హైదారాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ప్రారంభానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచనలు జారీ చేశారు.
పరీక్ష కేంద్రానికి వచ్చే అభ్యర్థులందరూ తప్పని సరిగా తమతోపాటు హాల్‌టికెట్ తెచ్చుకోవాలని, ఒకవేళ హాల్ టికెట్‌పై ఫొటో ముద్రించి ఉండకపోతే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇక ఈ రోజు జరిగే పాలీ సెట్ పరీక్షకు అన్ని పరీక్ష కేంద్రాల్లో వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీలో ఈఏపీసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ 2024 పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరి ఆన్సర్ ‘కీ’ విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులందరూ మే 25వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు మే 25వ తేదీ ఉదయం 10 గంటల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 16, 27 తేదీల్లో ఈఏపీసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
ఏపీ ఈఏపీసెట్ 2024 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.