TG PGECET 2024 Hall Tickets: తెలంగాణ పీజీఈసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడుంటుందంటే!

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలంగాణ పీజీఈసెట్‌ 2024 పరీక్ష జూన్‌ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి..

TG PGECET 2024 Hall Tickets: తెలంగాణ పీజీఈసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడుంటుందంటే!
TG PGECET 2024 Hall Tickets

Updated on: May 30, 2024 | 2:43 PM

హైదరాబాద్‌, మే 30: తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలంగాణ పీజీఈసెట్‌ 2024 పరీక్ష జూన్‌ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్ష జరుగుతుంది. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 12.30 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ ఏడాది జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పీజీఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తోంది.

పీజీఈసెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మడీ, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కాగా తెలంగాణ ఈజీఈసెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 120 మార్కులకు 2 గంటల్లో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కింగ్ ఉండదు. ప్రవేశ పరీక్షలో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులకు క్వాలిఫైయింగ్‌ మార్కులు ఉండవు. ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంకు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.