Telangana: తెలంగాణ అగ్రికల్చర్, వెటర్నరీ పోస్టుల భర్తీకి మెరిట్ లిస్ట్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
Telangana: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కొన్ని నోటిఫికేషన్లకు ఇప్పటికే..
Telangana: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కొన్ని నోటిఫికేషన్లకు ఇప్పటికే పరీక్షలు కూడా పూర్తి అయ్యాయి. ఇక తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ పోస్టులకు ఇటీవలే రాత పరీక్షను జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్పీ విడుదల చేసింది. ఈ మెరిట్ లిస్ట్‌ను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
మొత్తం 3942 మందికి సంబంధించిన మెరిట్ లిస్టును విడుదల చేశారు అధికారులు. మొత్తం 127 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 5885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3968 మంది రాత పరీక్షకు హాజరు కాగా, 26 మంది పేపర్లను వివిధ కారణంగా వల్ల తిరస్కరించారు. ఇక మొత్తం 3942 మంది మెరిట్ లిస్ట్ విడుదలైంది.
ఇవి కూడా చదవండి: