Telangana: తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్.. నేటితో ముగిసిన వేసవి సెలవులు! రేపట్నుంచి తరగతులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ ను విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు మార్చి 31 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో (మే 31)తో సెలవులు ముగియనున్నాయి..

Telangana: తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్.. నేటితో ముగిసిన వేసవి సెలవులు! రేపట్నుంచి తరగతులు ప్రారంభం
TS Inter academic calendar

Updated on: May 31, 2024 | 3:10 PM

హైదరాబాద్‌, మే 31: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ ను విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు మార్చి 31 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో (మే 31)తో సెలవులు ముగియనున్నాయి. దీంతో శనివారం (జూన్‌ 1) నుంచి జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ఇంటర్ 2024-25 వార్షిక క్యాలెండర్‌ ముఖ్యమైన తేదీలు ఇవే..

  • జూనియర్‌ కాలేజీల పునఃప్రారంభ తేదీ: జూన్ 1, 2024.
  • దసరా సెలవులు: అక్టోబర్‌ 10 నుంచి 13 వరకు
  • దసరా అనంతరం అక్టోబర్‌ 13 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి
  • హాప్‌ ఇయర్‌ పరీక్షలు: నవంబర్ 18 నుంచి 23 వరకు
  • సంక్రాంతి సెలవులు: జనవరి 11, 2025 నుంచి జనవరి 16 వరకు
  • సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 17 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి
  • ప్రీ ఫైనల్ పరీక్షలు: జనవరి 20 నుంచి 25 వరకు, 2025.
  • ప్రాక్టికల్ పరీక్షలు: ఫిబ్రవరి మొదటి వారం, 2025.
  • థియరీ పరీక్షలు: మార్చి మొదటి వారం 2025 నుంచి ప్రారంభం
  • 2024-25 విద్యా సంవత్సరానికి చివరి పని దినం: మార్చి 29, 2025.
  • వేసవి సెలవులు: మార్చి 30 నుంచి జూన్‌ 1, 2025 వరకు
  • ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు: మే చివరి వారం 2025
  • 2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్‌ కాలేజీల పునఃప్రారంభ తేదీ: జూన్‌ 2, 2025.

టీఎస్పీయస్సీ ఏఎంవీఐ ధ్రువీకరణ పత్రాల పరిశీలన తేదీలు వెల్లడి

తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి జూన్‌ 12, 13 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. ఇందులో ఎంపికైన వారు జూన్‌ 10 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.