Inter Results 2025 Date: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్ ఎప్పుడంటే..

| Edited By: Shaik Madar Saheb

Apr 02, 2025 | 6:39 PM

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ఇంటర్మీడియట్ బోర్డ్ (TSBIE) ప్రకటించింది. మార్చి 30న వేసవి సెలవులు ప్రారంభమయ్యాయని.. జూన్ 1 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలన్నీ ఈ వేసవి సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

Inter Results 2025 Date: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్ ఎప్పుడంటే..
Telangana Inter Results 2025 Date
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ఇంటర్మీడియట్ బోర్డ్ (TSBIE) ప్రకటించింది. మార్చి 30న వేసవి సెలవులు ప్రారంభమయ్యాయని.. జూన్ 1 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలన్నీ ఈ వేసవి సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది. వేసవి సెలవుల్లో ఏదైనా కాలేజీలు అనధికారికంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది. ఎవరైనా అనధికారికంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు తల్లిదండ్రులకు సూచించింది.

వేసవి సెలవులను విద్యార్థులు స్వీయ అధ్యయనం, స్కిల్ డెవలప్మెంట్ కొరకు వినియోగించుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సూచనలు చేసింది. 2025 – 2026 అకాడమిక్ ఇయర్ కోసం తిరిగి జూన్ 2న తిరిగి ఇంటర్ కళాశాలలు తెరుచుకొనున్నట్లు తెలిపింది.

మరోవైపు ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ వేగవంతంగా జరుగుతుంది. ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. పరీక్షా ఫలితాల్లో పారదర్శకత పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లతో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు అధికారులు.. అంతా సవ్యంగా జరిగితే.. ఈ నెల నాటికి ఫలితాలు వెలువడనున్నాయి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.