TSBIE Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

|

Apr 25, 2024 | 6:09 AM

TS Intermediate Result 2024 Live Updates: రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఆ ఘడియ వచ్చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల..

TSBIE Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
TS Inter Results Live

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఆ ఘడియ వచ్చేస్తోంది. మరికొన్ని నిమిషాల్లో తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఇంటర్‌ ఫలితాలను వెల్లడించనున్నారు. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలతోపాటు మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి.

కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Apr 2024 01:36 PM (IST)

    కామారెడ్డిలో అత్యల్పంగా పాస్‌ పర్సెంటైల్

    ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో అత్యల్ప పర్సెంటైల్‌ నమోదైంది. ఫస్ట్‌ ఇయర్‌లో 34.81 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 44.29 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదైంది.

  • 24 Apr 2024 01:31 PM (IST)

    ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో మార్కుల మెమోలు

    ఇంటర్‌ విద్యార్ధుల షార్ట్‌ మార్క్స్‌ మెమోలు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర ప్రయోజనాల కోసం విద్యార్ధులు ఈ మార్కుల మెమోలు వినియోగించుకోవచ్చు. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి 10 రోజులలోపు మాత్రమే మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుందని బోర్డు సూచించింది.


  • 24 Apr 2024 11:56 AM (IST)

    ఎంపీసీ గ్రూప్‌ టాప్‌.. హెఈసీ గ్రూప్‌ లీస్ట్

    గ్రూప్‌ వైజ్‌ చూస్తే.. ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీలో 68.52 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 73.85 శాతం ఉత్తీర్ణత పొందారు. బైపీసీలో ఫస్ట్‌ ఇయర్‌ 67.34 శాతం, సెకండ్‌ ఇయర్‌ 67.52 శాతం, సీఈసీ ఫస్ట్‌ ఇయర్‌ 41.73 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 44.81 శాతం, హెచ్‌ఈసీలో 31.57 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 43.51 శాతం, ఎమ్‌ఈసీ ఫస్ట్ ఇయర్‌లో 50.51 శాతం, సెకండ్ ఇయర్‌లో 59.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • 24 Apr 2024 11:49 AM (IST)

    స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.. 69.46 శాతం మాత్రమే పాస్‌

    ఈ ఏడాది జనరల్ కోర్సులో రెగ్యులర్‌ విద్యార్ధులు ఫస్ట్‌ ఇయర్‌ 4,30,413, సెకండ్‌ ఇయర్‌ 4,01,445 మంది హాజరయ్యారు. ఇంటర్‌ వొకేషన్‌లో ఫస్ట్ ఇయర్ 48,310, సెకండ్ ఇయర్‌లో 42,723 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం 8,31,858 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో 69.46 శాతం ఉత్తీర్ణత పొందారు.

  • 24 Apr 2024 11:45 AM (IST)

    విద్యార్ధుల ఫిర్యాదుల కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లు

    ఇంటర్‌ మార్కుల్లో అనుమానాలు, సందేహాలు వంటివి తలెత్తితే 040-24655027 హెల్ప్‌ డెస్క్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. లేదంటే kelpdesk-ie@telangana.gov.inకు మెయిల్‌ పంపవచ్చు.

  • 24 Apr 2024 11:43 AM (IST)

    ఆ విద్యార్ధుల కోసం స్టూడెండ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్ జారీ

    మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్‌ అయ్యాయని ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్ధుల కోసం ఇంటర్‌ బోర్డు హెల్ప్‌లైన్‌ నంబర్ విడుదల చేసింది. టెలీ మానస్‌కు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 14416

  • 24 Apr 2024 11:40 AM (IST)

    ఇంటర్‌ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన మేడ్చల్‌, సంగారెడ్డి విద్యార్ధులు

    మేడ్చల్‌, సంగారెడ్డికి చెందిన విద్యార్ధినులు తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో స్టేట్‌ టాప్‌ ర్యాంక్ లు సాధించారు.

  • 24 Apr 2024 11:32 AM (IST)

    ఇంటర్ ఫలితాల్లో అత్యంత తక్కువ ఉత్తీర్ణత నమోదైన జిల్లాలు ఇవే

    మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి 71.7 % తో మొదటి స్థానంలో నిలిచింది. 34.81 % తో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 82.95% తో ములుగు మొదటి స్థానం. 44.29% తో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది.

  • 24 Apr 2024 11:30 AM (IST)

    మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

    పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి మే 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

  • 24 Apr 2024 11:29 AM (IST)

    రేపటి నుండి రీ కౌంటీగ్…రీ వాల్యూయేషన్ కు అవకాశం

    రీ కౌంటీగ్…రీ వాల్యూయేషన్ చేసుకునే విద్యార్దులకు రేపటి నుండి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

  • 24 Apr 2024 11:21 AM (IST)

    ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు..

    ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిలు 68.95 శాతం, అబ్బాయిలు 51.05 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిలు 72.53 శాతం, అబ్బాయిలు 56.01 శాతం ఉత్తీర్ణత పొందారు.

  • 24 Apr 2024 11:16 AM (IST)

    సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్లో ఫలితాలు

    ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా. సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

  • 24 Apr 2024 11:14 AM (IST)

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో రంగారెడ్డి జిల్లా టాప్.. సెకండ్ ఇయర్లో ములుగు టాప్

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 60.01 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 64.16 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫస్ట్ ఇయర్ లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ మేడ్చల్ సెకండ్ ప్లేస్ లో నిలిచాయి. సెకండ్‌ ఇయర్‌లో ములుగు 83.95 శాతం ఉత్తీర్ణతతతో టాప్లో నిలిచింది.

  • 24 Apr 2024 11:07 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 24 Apr 2024 11:06 AM (IST)

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. సింగిల్ క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండిలా

    ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలతోపాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి.

  • 24 Apr 2024 10:53 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాల లైవ్ ప్రోగ్రాం ఇక్కడ వీక్షించండి

  • 24 Apr 2024 10:48 AM (IST)

    మరికాసేపట్లోనే ఇంటర్ పరీక్ష ఫలితాలు

    ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 4,78,527 మంది హాజరుకాగా.. సెకండ్ ఇయర్‌లో 4,43,993 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల తర్వాత ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించనున్నారు.

  • 24 Apr 2024 10:44 AM (IST)

    ఎన్నికల ‘కోడ్‌’ ఎఫెక్ట్ ముందుగానే ఇంటర్‌ ఫలితాలు

    ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 10తో మూల్యాంకనం పూర్తి అయ్యింది. జవాబు పత్రాలను ఒకటికి మూడు సార్లు పరిశీలన చేసి మార్కులను డీకోడ్‌ చేసి ఫలితాల ప్రకటనకు రంగం సిద్ధం చేశారు. గతేడాది మే 9వ తేదీన ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయగా ఈసారి సార్వత్రిక ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తున్నారు.

Follow us on