TS Inter Results: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. సింగిల్‌ క్లిక్‌తో రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి.

|

May 09, 2023 | 11:53 AM

తెలంగాణలో నేడు ఇంటర్‌ రిజల్ట్స్‌ విడుదల కాబోతున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇంటర్‌ పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల..

TS Inter Results: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. సింగిల్‌ క్లిక్‌తో రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి.
Telangana Inter Results
Follow us on

తెలంగాణలో నేడు ఇంటర్‌ రిజల్ట్స్‌ విడుదల కాబోతున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇంటర్‌ పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రిజల్ట్స్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చూసుకోడి..

ఇంటర్‌ ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు పలు వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఇక.. గత మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4లక్షల82వేల 501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4లక్షల23వేల 901 మంది హాజరయ్యారు. అయితే.. ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోనే పూర్తయింది. కానీ.. మంత్రి సబిత ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున.. ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని.. ఇవాళ రిజల్ట్స్‌ విడుదల చేయబోతున్నారు ఇంటర్‌ బోర్డు.

ఇవి కూడా చదవండి

ఫలితాలు విడుదలైన వెంటనే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ విద్యార్థులను తమ ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్‌ లు  https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..