TS Inter: ఇంటర్‌  ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌పై కొనసాగుతున్న రగడ.. కీలక ప్రకటన జారీ చేసిన బోర్డు సెక్రెటరీ

|

Jan 30, 2023 | 2:01 PM

లెక్చరర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆన్‌స్ర్కీన్‌ వాల్యుయేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను చేయకుండానే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం మంచిది కాదని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

TS Inter: ఇంటర్‌  ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌పై కొనసాగుతున్న రగడ.. కీలక ప్రకటన జారీ చేసిన బోర్డు సెక్రెటరీ
Telangana Inter Board
Follow us on

తెలంగాణలో ఇంటర్‌ పేపర్ల ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌పై రగడ కొనసాగుతోంది. ఇంటర్‌ బోర్డ్‌ తీసుకున్న నిర్ణయంపై కొందరు తప్పుపడుతున్నారు. లెక్చరర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆన్‌స్ర్కీన్‌ వాల్యుయేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను చేయకుండానే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం మంచిది కాదని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌పై వస్తోన్న ఫిర్యాదులు, విమర్శలపై ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ ఒక కీలక ప్రకటన విడుదలచేశారు. ‘ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు అనేక క్రిమినల్ కేసులుతో సస్పెండైన ఒక జూనియర్ లెక్చరర్ బోర్డు అధికారులపై అనేక ఆరోపణలు చేశారు. సంబంధం, అర్హత లేని వ్యక్తి బోర్డు వాల్యుయేషన్‌ సిస్టంపై అనుమానాలు, అపోహలు క్రియేట్ చేశారు. ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌లో పారదర్శకత ఉంటుంది. ఇంట్లో నుండి కూడా వాల్యుయేషన్ చేయవచ్చు. దీని వల్ల ఖర్చు, పనిభారం పూర్తిగా తగ్గిపోతుంది. ఆన్‌లైన్‌లో చాలా కచ్చితత్వంతో వాల్యుయేషన్ చేయవచ్చు.నూతన విధానం వల్ల రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్ కూడా సులభంగా చేయవచ్చు. విద్యార్ధుల సౌలభ్యం కోసమే ఇంటర్ లో ఆన్‌లైన్‌ వాల్యుయేషన్ ప్రవేశపెడుతున్నాం’

‘మంచి పని చేస్తుంటే సస్పెండైన వ్యక్తి ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంట్రోల్ చేస్తున్న కొంతమంది తమ చేతుల నుండి వ్యవస్థ పోతుందనే బోర్డుపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈసారి ప్రయోగాత్మకంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజెస్ పేపర్స్ మాత్రమే ఆన్‌లైన్ వాల్యుయేషన్‌ చేస్తున్నాం. గతంలో తప్పుడు ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలను ఆన్‌లైన్‌ బిడ్డింగ్ కి అనుమతించడం లేదు. ఓయూ, అంబేడ్కర్ యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ వాల్యుయేషన్ పద్ధతే కొనసాగుతోంది. కొంతమంది ఇంటర్ బోర్డును ఆదాయవనరుగా మార్చుకున్నారు. అలాంటి వారి ఆటలు సాగవని బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేపర్ వాల్యుయేషన్ పై ఎలాంటి గందరగోళం లేదు. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ప్రకటనలో పేర్కొన్నారు నవీన్‌ మిట్టల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..