తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలను సోమవారం (మే 15) నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్లలో www.acadtsbie.cgg.gov.in, www.tsbie.cgg.gov.in రేపట్నుంచి దరఖాస్తు చేసుకోవల్సిందిగా బోర్డు సూచించింది. ఈ మేరకు తెలియజేస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ నెల 30వ తేదీలోపు ప్రవేశాలు పూర్తి చేయాలని తెలిపారు. ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్ధులు ప్రవేశాలు పొందాలని తెల్పుతూ వాటి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 15 నుంచి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభంకానున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు జూన్ 14 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని, అదే నెల14 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.