TG ICET Counselling: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. సెప్టెంబరు 1 నుంచి రిజిస్ట్రేషన్లు

|

Aug 25, 2024 | 8:01 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. శనివారం ఐసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యామండలి, ప్రవేశాల కమిటీ ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి..

TG ICET Counselling: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. సెప్టెంబరు 1 నుంచి రిజిస్ట్రేషన్లు
TG ICET Counselling
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. శనివారం ఐసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యామండలి, ప్రవేశాల కమిటీ ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కన్వీనర్‌ ఎ శ్రీదేవసేన, విద్యామండలి ఉపాధ్యక్షుడు ఎస్‌కే మహమూద్, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ నరసింహాచారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు తొలి విడత, సెప్టెంబరు 20 నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. సెప్టెంబరు 27న పూర్తిస్థాయి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

తెలంగాణ ఐసెట్‌ 2024 తొలి విడత షెడ్యూల్‌ ఇదే..

  • సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ఉంటుంది
  • సెప్టెంబరు 3 నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది
  • సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుంది
  • సెప్టెంబరు 14వ తేదీన సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
  • సెప్టెంబరు 14 నుంచి 17వ తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది

నీట్‌ పీజీ 2024 ఫలితాలు విడుదల.. ఆగస్టు 30 నుంచి స్కోర్‌ కార్డు అందుబాటులోకి

నీట్‌ పీజీ-2024 పరీక్ష ఫలితాలు ఆగస్టు 23 విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆగస్టు 11న రెండు షిప్టుల్లో పలు పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 2024 – 25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డిప్లొమా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి నీట్‌ పీజీ ర్యాంకు కీలకం. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్- పీడబ్ల్యూబీడీ వారికి 45 పర్సంటైల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వారి 40 పర్సంటైల్ క్వాలిఫైయింగ్‌ మార్కులు వచ్చిన వారికి మాత్రమే సీట్లు దక్కుతాయి. ఆగస్టు 30 నుంచి స్కోర్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

నీట్‌ పీజీ-2024 పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.