
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్ 2025) పరీక్ష మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఉన్నత విద్యామండలి సోమవారం (జూన్ 2) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక ఐసెట్ పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 8, 9 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే వెల్లడించింది కూడా.
తెలంగాణ ఐసెట్ 2025 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 1న తుది రాతపరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 97.52 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అదే రోజు సాయంత్రం 5 గంటలకు పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల చేసింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే జూన్ 4 సాయంత్రం 5 గంటల్లోగా slprbap.obj@gmail.com కు మెయిల్‌కు పంపించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా ఓ ప్రకటనలో అభ్యర్ధులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ మెగా డీఎస్సీ 2025 ఎస్జీటీ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 13, 17, 18, 19, 20, 21 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 13, 17, 18 తేదీల్లో ఎస్జీటీ పరీక్షలు, జూన్ 19న ఎస్జీటీ, ఎస్జీటీ-హెచ్‌హెచ్, ఎస్జీటీ-వీహెచ్ పరీక్షలు, జూన్ 20న ఎస్జీటీ పరీక్ష, 21న ఎస్జీటీ ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్ మీడియం పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఏపీ డీఎస్సీ 2025 ఎస్జీటీ పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.